Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్టింగ్ ఆపరేషన్లో బుక్కయిన రాష్ట్ర మంత్రి..?

గతంలో ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ, యాక్సిస్ బ్యాంకుల్లో మనీలాండరింగ్ యధేచ్చగా సాగుతోందని కోబ్రాపోస్ట్ అనే ఆన్ లైన్ మ్యాగజైన్ స్టింగ్ ఆపరేషన్లో బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కోబ్రాపోస్ట్ నిర్వహించిన మరో రహస్య పరిశోధనలో నిర్ఘాంతపరిచే విషయం వెల్లడైంది. రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ కు హవాలా కుంభకోణంలో పాత్ర ఉందని కోబ్రాపోస్ట్ అంటోంది.

ఇటీవలే నిర్వహించిన తాజా స్టింగ్ ఆపరేషన్లో భాగంగా... కోబ్రాపోస్ట్ ప్రతినిధులు తాము రూ.25 కోట్ల మేర పెట్టుబడి పెట్టేందుకు సిద్దంగా ఉన్నామని ఢిల్లీలోని ఓ బ్యాంకర్ ను కలిశారు. ఆ బ్యాంకర్ వారిని హైదరాబాద్ లోని వాసు అనే మాజీ పోలీసుకు పరిచయం చేశాడు. తిరుపతిలోని ప్రసాద్ అనే వైద్యుడికి చెందిన రియల్ ఎస్టేట్ వెంచర్ లో పాతిక కోట్ల మేర పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉందని వాసు కోబ్రాపోస్ట్ ప్రతినిధులకు సలహా ఇచ్చాడు.

విస్మయకర విషయం ఏమిటంటే, కోబ్రాపోస్ట్ ప్రతినిధులు పెట్టే పెట్టుబడికి తాను హామీదారుడిగా నిలుస్తానంటూ మంత్రి శైలజానాథ్ తెరపైకి వచ్చారు. అంతేగాకుండా కోబ్రాపోస్ట్ ప్రతినిధులతో స్వయంగా ఫోన్ లో మాట్లాడినట్టు సమాచారం.

More Telugu News